పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ లు అందజేశారు. వీరికి రూ. 8 లక్షల 89 వేల మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాను మోడల్ ప్రాజెక్టుగా ఎంపికచేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు సహకారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: