తణుకులో టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
సొసైటీ రోడ్డులోని పార్క్ వద్ద ఏర్పాటు చేసిన టంగుటూరి విగ్రహాన్ని ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి అని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి.. న్యాయవాదిగా ఎంతో పేరు సంపాదించి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
ఇదీ చదవండి :