పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు.. ఓ పేద కుటుంబానికి నిత్యావసరాలు అందించి మానవత్వం చాటుకున్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ బాలుడు యాచిస్తూ కనిపించాడు. అతణ్ని ఆరా తీయగా.. తండ్రికి పనికి వెళ్లిన చోట గాయమైందని.. తల్లికి కుక్క కరిచి ఇంట్లోనే ఉందని సమాధానమిచ్చాడు. కుటుంబం గడవడం కోసం ఆ పని చేస్తున్నట్లు చెప్పాడు. సిబ్బందితో కలిసి ఆ కుటుంబానికి నిత్యావసరాలు అందించిన సీఐ.. పిల్లలను పనికి పంపడం చట్టారిత్యా నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: సర్వాంగ సుందరంగా ఏపీ నిట్