రోజు రోజుకు నియోజకవర్గ పరిధిలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు తిరిగి నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు. గోస్తనీ వంతెన, రాజీవ్ చౌక్ సెంటర్, వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా రోడ్లలోనూ.. వంతెన పైన పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాడేపల్లిగూడెం వైపు గ్రామాల ప్రజలు పట్టణంలోనికి రాకుండా ఫ్లైఓవర్ వంతెన రెండు వైపులా మూసివేశారు. మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న కారణంగా.. పట్టణ ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఈ నిషేధాజ్ఞలు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి:
'మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చారిత్రాత్మక నిర్ణయం'