రాష్ట్రంలో 3200 కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మాణం చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖామాత్యులు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని కొనియాడారు. త్వరలో ఆక్వా వ్యవసాయ రైతులకు మేలు చేసేందుకు ఈ-మార్కెటింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పే చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను స్తంభింప చేస్తాం అనడం విడ్డూరంగా ఉందని విమర్శించిన మోపిదేవి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నిటిని 90 శాతం అమలు చేసిన ఘనత జగన్ మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు.
ఇవీ చూడండి...