పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం రేలంగి గ్రామానికి చెందిన ఈ మహిళా సంఘం పేరు సాయి శక్తీశ్వరా టైలరింగ్ గ్రూప్. కొంతమంది మహిళలు కలసి.. ఈ టైలరింగ్ గ్రూపును ఏర్పాటు చేసుకొన్నారు. ప్రభుత్వం అందించే.. విద్యార్థుల ఏకరూపదుస్తులు, మాస్కులు కుట్టేవారు. ఇందులో పనిచేసే మహిళలు నిరుపేదలు కావడం వల్ల.. బకాయిలు ఇప్పటికీ రాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాదిమంది మహిళలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
అందని సొమ్ము..
ప్రభుత్వం అందించే మాస్కులు, విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టించడానికి ప్రధాన గుత్తేదారులు.. మహిళలకు పని అప్పగించారు. పని పూర్తయ్యాక.. డబ్బులు కొంత ఆలస్యంగా ఇస్తామని మాస్కులు, ఏకరూప దుస్తులు తీసుకెళ్లారు. బకాయిలు కోసం అడుగుతుంటే... అదిగో..ఇదిగో.. అంటూ దాటవేస్తున్నారని, గుత్తేదారు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని మహిళలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. బకాయిలు విడుదల అయ్యేలా చూడాలని మహిళలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Family Suicide: ఇద్దరు పిల్లలతో సహా.. గోదావరిలో దూకిన దంపతులు!