మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రెవెన్యూ సబ్‌డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో పటిష్ఠి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు... జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు. రెండు మండలాల్లోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక పంచాయతీలకు అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు ఏలూరులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురిచేసే విలువైన వస్తువులు, మద్యం, నగదును నివారించడానికి అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సమన్వయంతో పనిచేస్తున్నాం: డీఎస్పీ లతాకుమారి
ప్రశాంత వాతావణంలో ఎన్నికలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని పోలవరం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. జీలుగుమిల్లి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. 'సబ్ డివిజన్ పరిధిలో 126 పంచాయతీలు, 760 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నాయి. 122 అతి సమస్యాత్మక, 126 సమస్యాత్మక, 180 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి నిఘా ఏర్పాటు చేశాం. రాష్ట్ర సరిహద్దు నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తే సహించేది లేదు. ఒకే వ్యక్తి మూడుసార్లు మద్యం అక్రమ రవాణాలో పట్టుబడితే రౌడీషీట్ కేసు నమోదు చేస్తాం' అని హెచ్చరించారు.