పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో.. ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఇటీవల హతమయ్యాడు. అతనికి తండ్రి రామిరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయంపై.. మృతుడి సోదరుడు సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి రామిరెడ్డే.. ప్రేమ్ కుమార్ ను హతమార్చాడని ఫిర్యాదు చేశారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత రామిరెడ్డి రెండో వివాహం చేసుకుని మొదటి సంతానాన్ని నిర్లక్ష్యం చేశాడని.. ఈ క్రమంలోనే ప్రేమ్ తో గొడవ పడి చంపేశాడని ఫిర్యాదులో సోమిరెడ్డి ఆరోపించారు.
అంతే కాక.. ప్రేమ్ కుమార్ కు కామెర్లు వచ్చాయని అబద్ధం చెప్పి అంత్యక్రియలను సైతం పూర్తి చేశాడని పోలీసులకు సోమిరెడ్డి చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేయించారు. నివేదిక వచ్చాక.. ప్రేమ్ కుమార్ మృతికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: