ETV Bharat / state

చెరువుకు గండి.. వరదలో చిక్కిన యువకుడు.. కాపాడిన ఎస్సై

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలోని చెరువుకు గండి పడటం వల్ల అల్లిపల్లి వద్ద వంతెన ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓ యువకుడు వంతెన దాటుతుండగా వరదలో గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న ఎస్సై స్వామి.. స్థానికుల సాయంతో అతన్ని రక్షించారు.

si swamy save a boy from floods at allipally west godavari district
author img

By

Published : Oct 13, 2020, 3:40 PM IST

చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలోని చెరువుకు గండి పడింది. చెరువును ఆనుకొని ఉన్న ఎస్సీ కాలనీలోని నివాసాల మధ్యకు వరద నీరు చేరింది. సుమారు 100 కుటుంబాలకు చెందినవారు నిరాశ్రయులు అయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. స్థానిక నేతలు వారికి సహాయం చేస్తున్నారు.

ఈ క్రమంలో అల్లిపల్లి వద్ద వంతెనపై ద్విచక్రవాహనంపై దాటుతుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు వరదలో గల్లంతు అయ్యాడు. అ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై స్వామి.. స్థానికులు సాయంతో యువకుడిని రక్షించారు. గ్రామస్తులు ఎస్సై, సాహసం చేసిన యువకులను అభినందించారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.