పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల అంతర్గత బదిలీలు జరిగాయి. దీనిలో భాగంగా ప్రసాదం తయారీ విభాగంలో లావాదేవీలకు సంబంధించి అధికారులు రికార్డులను పరిశీలించారు. వాటికనుగుణంగా స్టాక్ ఉందో లేదో లెక్కల చూశారు. స్వామివారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి 1100 కేజీలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.5.28 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ సొమ్మును బాధ్యుడైన సీనియర్ అసిస్టెంట్ మద్దాల శ్రీనివాసరావు నుంచి రికవరీ చేశారు. అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో ఆర్ ప్రభాకర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి ఉద్యోగాల తొలగింపునకు నిరసనగా ఎన్ఎన్ఎంల ధర్నా