పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని లలితా త్రిపుర సుందరి అలంకరణలో తీర్చిదిద్దారు. అమ్మవారి పుట్టింటివారిగా అక్కిన కుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు కరోనా నిబంధనలకు అనుగుణంగా దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి