పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఇవాళ భారీగా మద్యం పట్టుబడింది. జంగారెడ్డి గూడెంలో తెలంగాణ నుంచి తరలిస్తోన్న ఐదు లక్షల విలువ చేసే 2వేల 616 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు కార్లు, ద్విచక్రవాహనంతో పాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
యలమంచిలి మండలం కాజా వద్ద ఆరు లక్షల విలువ చేసే మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 19వందల మద్యం సీసాలతో పాటు కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా మల్కిపురానికి ఈ మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.