ETV Bharat / state

అధికారులకు ముడుపులు... పంట పొలాల్లో అక్రమంగా తవ్వకాలు - land

మొన్నటి వరకు చెరువుల్లో అక్రమ  తవ్వకాలు చేపట్టి కోట్లు దండుకున్న మట్టి మాఫియా కన్ను ఇప్పుడు పచ్చని  పంట పొలాలపై పడింది. డబ్బులను ఎరగా చూపి తవ్వకాలు చేపడుతున్నారు. బంగారం పండే పొలాలను నాశనం చేస్తున్నారు. అన్యాయాలు అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకుండిపోతున్నారు.

పూర్తిగా మట్టిని తవ్వేసిన పొలం
author img

By

Published : May 3, 2019, 7:23 AM IST

పంట పొలాల్లో భూకాసురుల భీభత్సం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని నీలాద్రిపురం, అప్పారావుపేట, వీరంపాలెం, బంగారు గూడెం, వెంకట్రావుపురం, కొమ్ముగూడెంలో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టితవ్వకాలు జరిగిపోతున్నాయి. పంట పొలాలను అక్రమ సంపాదన కోసం తవ్వేస్తున్నారు. రేయింబవళ్లు సుమారు వంద ఎకరాల్లో మట్టి తరలిపోతోంది. ప్రతి రోజు 2వందల నుంచి 300 లారీల వరకు మట్టి ఎత్తుకుపోతున్నారు. లారీ మట్టికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తే ట్రాక్టర్ మట్టికి 600 వరకు వసూలు చేస్తున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు
అంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల సర్పంచులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందున చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ మట్టిని తాడేపల్లిగూడెంలోని నాన్‌లేఅవుట్లు పూడ్చేందుకు వినియోగిస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు నుంచి ఉన్నత స్థాయి వరకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు మట్టి మాఫియాపై ఉన్నాయి. అందుకే ఇటుగా చూసేందుకు అధికారులు ఇష్టపడం లేదన్నది స్థానికుల వాదన. అందుకే యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి.

Intro:Ap_Vsp_106_01_Avanthi_Visit_Jutemill_Ab_c16
ది రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:చారిత్రక నేపథ్యం ఉన్న ఏళ్లతరబడి అక్రమ లాకౌట్ లో ఉన్న చిట్టివలస జూట్ మిల్లును వైకాపా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి మొత్తం శెట్టి శ్రీనివాసరావు సందర్శించారు తాము అధికారంలోకి వస్తే వచ్చే మే నెల నాటికి జూట్ మిల్ సమస్యను పరిష్కరిస్తామని ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు

Conclusion:జ్యూట్ మిల్ లో ఉన్న యంత్రాలు తదితర వాటిని పరిశీలించారు కార్యక్రమంలో ఏఐటీయూసీ కాంగ్రెస్ కార్మిక సంఘం తదితర నాయకులు పాల్గొన్నారు
బైట్: ముత్తం శెట్టి శ్రీనివాసరావు వైకాపా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.