కారు బోల్తా పడి మహిళ మృతి.. నలుగురికి గాయాలు - road accident one person death four persons are injured newsupdates
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు వెనుక టైరు పంచర్ కావడం వల్ల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అంజలి అనే టెక్నీషియన్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు వైద్యులు, మరో మహిళ, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. చేబ్రోలు ఎస్సై వీర్రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడకు చెందిన కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బంది కారులో కాకినాడ నుంచి ఖమ్మం బయలుదేరు. కైకరం వద్దకు వచ్చేసరికి వెనక కారు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ పక్క రహదారిపై ఆగింది. ప్రమాదంలో టెక్నీషియన్ ఎం అంజలి (22) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు వైద్యులు, ఒక మహిళ, కార్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.