పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మొక్కజొన్న పొలంలో కంకులు తీసేందుకు సుమారు 40 మంది వ్యవసాయ కూలీలు వెళ్లారు. పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కామవరపుకోట శివారులో వీరు ప్రయాణిస్తోన్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మంగమ్మ అనే మహిళ మృతి చెందగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కామవరపుకోట, ద్వారకా తిరుమల ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమించటంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: