పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని... అదే దారిలో వెళుతున్న తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఐ చైతన్య కృష్ణ తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్తిలిలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, సీఐ.. తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదాన్ని గమనించారు. పెట్రోలు బంకు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న విషయం తెలుసుకున్నారు. హుటాహుటిన క్షతగాత్రులను పోలీసు వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఇవి కూడా చదవండి: