జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరానికి చెందిన సత్యనారాయణ పని నిమిత్తం తాడువాయి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. లక్ష్మీపురం వంతెన వద్ద తెలంగాణ నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును సత్యనారాయణ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: చీరలందు ఈ 'గడ్డి చీర' వేరయా.. ఉతికితే.. ఎలా మరి?