పెదవేగి మండలం చక్రాయగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ వరదరాజులు ఆదేశాలు మేరకు గ్రామంలో ఉన్న ఇమ్మడి సుబ్రహ్మణ్యం ఇంటిపై తనిఖీలు చేశారు. ఈ దాడిలో 5 టన్నుల బియ్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎస్సై ఏసుబాబు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :