పశ్చిమగోదావరిజిల్లా తణుకులోని మల్లికాసులపేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ ప్రమాదంలో 46 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనలో ఆయా కుటుంబాలకు చెందిన రేషన్‌కార్డులు కాలిపోయాయి. స్పందించిన రెవెన్యూ అధికారులు కొత్త కార్డులు మంజూరుచేశారు. వాటితో పాటు దాతలు సమకూర్చిన చీరలు, బియ్యాన్ని బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఇవీ చూడండి: