పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రథసప్తమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉష, ఛాయ, సంజ్ఞ, పద్మిని సమేతుడై సప్తాశ్వ రథాసీనుడై ఏకశిలా రూపంలో... చిద్విలాసం ఒలికిస్తున్న స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రజలు దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని రథసప్తమి రోజు దర్శించుకుంటే సర్వరోగాలు హరించి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగా.. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయం పరిసరాలు రద్దీగా మారాయి. అధికారులు సుమారు కిలోమీటరుపైగా బారికేడ్లు నిర్మించారు. అన్ని సదుపాయాలు కల్పించామని దేవాలయ అధికారి సత్యనారాయణ తెలిపారు.
ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజల అభీష్టాలు నెరవేరాలని సూర్య భగవానుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: