రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగింది. పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం, సాయంత్రం కొనసాగిన సేవలు భక్తులను ఆద్యంతం అలరించాయి. ప్రభాతవేళ సప్త అశ్వాలను అధిరోహించిన శ్రీవారు ఉభయదేవేరులతో సూర్యప్రభ వాహనంపై కొలువై ఆలయ ప్రాంగణంలో విహరించారు.
భక్తులకు అభయ హస్తాన్ని ప్రసాదిస్తూ స్వామి వారు, ఉభయదేవేరులతో దర్శనమిచ్చారు. సూర్య, చంద్రప్రభ వాహనాలపై దేదీప్యమానంగా వెలుగొందిన స్వామి అమ్మవార్ల దివ్య మూర్తులను దర్శించి భక్తులు తరించారు.
ఇదీ చదవండి: