ETV Bharat / state

ఏపీలో ప్రభుత్వ యంత్రాంగమే దొంగనోట్ల పంపిణీకి తెరలేపింది: రఘురామకృష్ణరాజు

MP RRR Letter To PM: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ యంత్రాంగమే దొంగనోట్ల పంపిణీకి తెర లేపిందంటూ ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లే స్వయంగా దొంగనోట్లు పంచుతున్నారని వివరించారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Raghuramakrishna Raja
రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jan 3, 2023, 7:56 PM IST

MP RRR Letter To PM: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ యంత్రాంగమే దొంగనోట్ల పంపిణీకి తెరలేపిందని, రాష్ట్రంలో వృద్దాప్య పించన్లు పంపిణీ చేసే వాలంటీర్లే స్వయంగా దొంగనోట్లు పంచుతున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి పిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంపై వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. పించన్ల పంపిణీలో దొంగ నోట్లు కలిపి పంచిన వ్యవహరంలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదన్న రఘురామ అసలు దోషులు ఎవరో తేలాలి అంటే లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే కేసును ​ఎన్​ఐఏకి అప్పగించాలని లేఖలో కోరారు.

అదే విధంగా.. పించన్లు అన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే వెళ్లేలా డీబీటీ వ్యవస్థను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. గృహ సారధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లను నియమించి నెలకు ఐదు వేల రూపాయలు భత్యంగా ఇస్తున్నారని, బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బుల్లో దొంగనోట్లు చేర్చినట్లు సదరు వ్యక్తే అంగీకరించారని, అలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తును కేంద్ర సంస్థ ద్వారా చేపట్టాల్సిన అవసరం ఉందని రఘురామ లేఖలో వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.