ETV Bharat / state

పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపునకు కసరత్తు - ఏపీలో ఆస్తి పనున్నపెంపు అప్​డేట్స్

పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంపుదలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే సంవత్సరం 2021- 22 నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా లోని 9 పురపాలక సంఘాల్లో 12 కోట్ల 88 లక్షల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Property tax hike exercise in towns in west godavari district

author img

By

Published : Dec 3, 2020, 1:43 PM IST

పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంపునకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలపడంతో వచ్చే 2021 - 22 ఆర్థిక సంవత్సర ప్రారంభం నుంచి అమల్లోకి తేవాలనే యోచనతో అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు ప్రాంతాల వారీగా అద్దె ప్రతిపాదికన ఆస్తిపన్ను విధిస్తుండగా ఇక నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిర్దేశించిన ఆస్తి విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే స్థల విలువతో పాటు భవన నిర్మాణ విలువను కలిపి పరిగణనలోకి తీసుకుంటారు.

Property tax hike exercise in towns in west godavari district
మున్సిపాలిటీల ప్రకారం పన్ను వడ్డన

దీనివల్ల ప్రస్తుతం చెల్లించే పన్ను పెరుగుతుందని అంచనా. పెంచిన మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదికి 15 శాతం వంతున నిర్దేశించిన మొత్తం వరకు పెంచుకుంటూ వెళ్తారు. దీంతోపాటు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏటా పెరిగే ఆస్తి విలువ కనుగుణంగా పన్ను పెరుగుతుంది. కొత్త విధానంలో నివాసగృహాలపై విలువ ఆధారంగా 0.10 శాతం నుంచి 0.50 వరకు ఆస్తిపన్ను పెంచుతారు. వాణిజ్య సముదాయాలపై 0.25 శాతం నుంచి 2.00 వరకు పెంచుతారు. ఇప్పటివరకు ఐదేళ్లకోసారి పన్ను పెంపుదల చేస్తుండగా, కొత్త విధానంలో ప్రతి ఏటా పన్ను పెంపుదల ఉంటుంది. కొత్తగా ఆస్తి పన్ను విధింపులోనూ మార్పు తీసుకువచ్చారు.

కొత్తగా గృహ, వాణిజ్య భవనాలకు పన్ను విధించాలంటే నూతన విధానాన్నే అనుసరిస్తారు. పెరుగుదల ప్రభావం విలువను బట్టి రూ.500 నుంచి రూ.3 వేలు వరకు ఉంటుంది. వాణిజ్య భవనాలకు రూ.లక్షల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా లోని 9 పురపాలక సంఘాల పరిధిలో 1,73, 652 నిర్మాణాలపై ఇప్పటివరకు రూ.86 కోట్ల మేర ఆదాయం వస్తుండగా పన్ను పెంపుదలతో మరో పన్నెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సర్వేకు సన్నద్ధం

ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఆస్తిపన్ను పెంపుదల శాతం ఎలా ఉండబోతుందో చెప్పే గణాంకాలను తెల్చేపనిలో పురపాలక ఉద్యోగులు నిమగ్నమయ్యారు. వీటి అమలుకు సంబంధించి ఇంటింటి సర్వే చేసేందుకు పురపాలక రెవెన్యూ ఉద్యోగులు, వార్డు సచివాలయ ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఆస్తిపన్నుకు సంబంధించి 2002 నుంచి నివాస గృహాలకు, 2007 నుంచి వాణిజ్య భవనాలకు ధరల పెరుగుదల లేదు. గతేడాది మాత్రం ప్రభుత్వం జీఐఎస్‌ సర్వేను ఓ ప్రైవేటు సంస్థ ద్వారా చేయించింది. ప్రతి ఇంటి స్థల నిర్మాణ విస్తీర్ణాన్ని లెక్కించి పన్ను విధింపు తక్కువగా ఉంటే పెంచింది. ఈ విధంగా అమలుకు నోచుకోవడంతో అప్పట్లో పట్టణవాసులపై కొంత భారం పడింది.

ఇదీ చదవండి:

సలాం పోరాట సమితి చలో అసెంబ్లీ అడ్డగింత.. నేతల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.