ETV Bharat / state

చదువు'కొనా'లంటే... ఆస్తులు అమ్ముకోవాల్సిందే! - no rules

ప్రభుత్వ పాఠశాలలపై అపనమ్మకం, తమ పిల్లల్ని బాగా చదవించాలనే కోరికతో ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. నిబంధనలు తుంగలో తోసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రైవేట్ పాఠశాలలలో చిన్నారులు(ఫైల్)
author img

By

Published : Jun 6, 2019, 9:03 AM IST

చదువు'కొనా'లంటే... ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నానాటికీ నమ్మకం తగ్గిపోతోంది. అప్పు చేసి అయినా కార్పొరేట్ విద్యను ఆశ్రయిస్తున్నారు కానీ... ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీనిని అదునుగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. జీవోనెంబర్-1, ఫీజుల రెగ్యులెటరీ కమిటీ, తిరుమలరావు కమిషన్ వంటి వాటిని ఆదేశాలను పక్కనపెట్టి.. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎల్​కేజీకే వేలల్లో ఫీజులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఏడాది 5 శాతం మేర ప్రైవేటు పాఠశాలల సంఖ్య పెరుగుతుండగా.. 10కి పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు బడివైపు పంపుతుండటం వల్లే.. ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచుతున్నాయి. ఎల్ కేజీ, యూకేజీ స్థాయిలోనే 25 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 35 నుంచి 50వేలు, ఆరోతరగతి నుంచి పదో తరగతి వారి నుంచి లక్షరూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలు, దుస్తులు, బూట్లు, ఇతర ఖర్చులంటూ మరో ఐదు వేల నుంచి పదివేల రూపాయలు దండుకొంటున్నాయి. వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ ఈ నిబంధనలు మాత్రం అమలు కావడం లేదు. ప్రభుత్వానికి ఇస్తున్న ఫీజుల వివరాల రికార్డులు వేరుగా ఉంటున్నాయి. సాధారణ ఫీజుల వసూళ్లకు మరో రికార్డు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లితండ్రులు కోరుతున్నారు.

Intro:యాంకర్: విశాఖలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ హ్యాండీ క్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నగర వాసులకు వేసవి వినోదంగా మారింది గత నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ ప్రదర్శనను తిలకించేందుకు నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వస్తున్నారు వినోదభరితమైన ఆ ప్రదర్శన గురించి ఇప్పుడు తెలుసుకుందాం

Body:వాయిస్ ఓవర్: సాగర తీరం వేదికగా విశాఖలో ఏర్పాటు అయిన హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది వేసవిలో ప్రతి ఏడాది విశాఖ బీచ్ రోడ్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం గత 19 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది అయితే నిర్వాహకులు ఈ ఏడాది సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎగ్జిబిషన్ ప్రధాన ద్వారాన్ని లండన్ బ్రిడ్జి నమూనాలో తయారు చేసి సందర్శకులను విశేషంగా అలరిస్తున్నారు వీటితోపాటు యువత అమితంగా ఇష్టపడే జెయింట్ వీల్ ఇంకా సాహసోపేతమైన పలు వినోద భరితమైన యంత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు సాయంత్రం వేళల్లో ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వేసవి వినోదాన్ని పొందుతున్నారు
---------
బైట్స్ వాక్స్ పాప్స్
---------
వాయిస్ ఓవర్: ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఈ ప్రదర్శనకు మంచి గిరాకీ ఏర్పడింది ఈ ప్రదర్శనలో యువతను ఆకట్టుకునే వినోదభరిత యంత్రాలతో పాటు చిన్న పిల్లలను సైతం ఆకర్షించే చల్లని నీటి కొలనులు యంత్రాల ద్వారా తిరిగే బైకులు గుర్రాలు ఇంకా పిల్లలు గంతులు వేసుకొని ఆడుకునేందుకు జంపింగ్ ట్రాక్ లు ట్రెక్కింగ్ ట్రాక్లు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి దీంతోపాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 100 రకాల స్టాల్స్ సందర్శకులకు సరికొత్త అనుభూతులను పంచుతున్నాయి
---------
బైట్ రాజారెడ్డి హ్యాండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు
---------

Conclusion: వాయిస్ ఓవర్: ఈ ప్రదర్శన వేసవి సెలవులు దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు సందర్శకులకు మరింత వినోదాన్ని పెంచేందుకు వచ్చే ఏడాది మరిన్ని వినోదాత్మకమైన ప్రదర్శన వస్తువులతో ఆకట్టుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ( ఓవర్).
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.