పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల, కొమరేపల్లిలో వింతవ్యాధి గురించి ప్రజలు అధైర్యపడవద్దని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ అన్నారు. బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. 22 మంది బాధితుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారని తెలిపారు.
వింతవ్యాధి కారణాలపై పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. అన్ని గ్రామాల నుంచి ఒకేసారి నీటి నమూనాలు సేకరిస్తామని సింఘాల్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్కు సాయంత్రం నివేదిక ఇస్తామని తెలిపారు. గతంలో చాలా సంస్థలు నమూనాలు తీసుకున్నాయని.. నివేదికలను ఉన్నత స్థాయి కమిటీకి అందించారు ఎ.కె.సింఘాల్ వెల్లడించారు. నివేదిక త్వరలో సీఎంకు అందిస్తామన్నారు.
ఇదీ చదవండి: పూళ్లలో వింత వ్యాధి.. సీఎం ఆదేశాలతో కొమరేపల్లికి సీఎస్