ETV Bharat / state

అయ్యప్ప పడిపూజను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఏంటంటే?? - భీమవరం

POLICE STOPS AYYAPPA PADIPUJA : రాష్ట్రంలో పలు రాజకీయ నాయకుల పర్యటనలు, సభలు నిర్వహించడానికి.. ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోలేదనే కారణంతో వాటిని నిలిపివేసిన ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా దేవుడికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి కూడా అనుమతి తీసుకోలేదనే కారణంతో పూజను అడ్డుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

police stops the ayyappa padipuja
police stops the ayyappa padipuja
author img

By

Published : Nov 6, 2022, 12:18 PM IST

AYYAPPA POOJA : ముందస్తు అనుమతి తీసుకోలేదన్న కారణంతో.. అయ్యప్ప పడిపూజను పోలీసులు అడ్డుకున్న ఘటన.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం మండలం సుంకర పెద్దయ్య వీధికి చెందిన కొందరు అయ్యప్ప మాలధారులు.. శనివారం రాత్రి అయ్యప్ప పడిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో.. పడిపూజకు అనుమతి లేదంటూ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వారిని అడ్డుకున్నారు. అయ్యప్ప మాలధారులు ఎంత వేడుకున్నా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, అయ్యప్ప మాలధారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా.. అయ్యప్ప మాలధారులు.. వీధుల్లో భజనలు, కీర్తనలు చేస్తూ భీమవరం బస్టాండ్‌ వద్దకు చేరుకుని.. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

అయ్యప్ప పడిపూజను అడ్డుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.