పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం శివార్లలో కోడిపందాలు ఆడుతున్నవారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారినుంచి 5 కోడి పుంజులు. 2,950 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చిలకపాడు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి.. నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.9,040 స్వాధీనం చేసుకున్నారు.
వడ్లూరు గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు పేకాటరాయుళ్లపై అరెస్ట్ చేసి.. రూ.4,650 స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేకంగా కోడి పందాలు, జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.