చేయి విరిగినా లెక్కచేయక విధులు నిర్వహిస్తూ.. వృత్తి నిబద్ధతను చాటుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ కాపా నాగేశ్వరరావు. నిన్న డ్యూటీలో ఉండగా జారిపడటంతో అతని చేయి విరిగింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు సిమెంట్ కట్టు వేశారు. కొన్నిరోజులు ఇంట్లో ఉండమని సూచించారు. ఉన్నతాధికారులూ విశ్రాంతి తీసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. కరోనా విపత్తు నేపథ్యంలో తన అవసరం ఉందని భావించిన నాగేశ్వరరావు నేడు యథావిధిగా విధులకు హాజరయ్యారు. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని అధికారులు అభినందించారు.
ఇవీ చదవండి.. 'విధులు నిర్వహించడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం'