పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, విద్యుదుత్పత్తి కేంద్రం, ఎడమ కాలువ పనులకు ప్యాకేజీల వారీగా తక్షణమే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం యత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ పరిశీలనతో కూడిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై శుక్రవారం ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ఎలా ముందుకు వెళ్లాలని జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, సీఎం కార్యాలయ అధికారులు చర్చించారు. కొత్తగా టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాయనున్నారు. లేఖలో ఏయే అంశాలు చేర్చాలి.. ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రివర్స్ టెండర్ల ద్వారా వ్యయం తగ్గించాలనుకోవటం వంటి అంశాలను లేఖలో చర్చించనున్నారు. అదనపు చెల్లింపులు, వివిధ ప్యాకేజీల్లో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదించింది. పోలవరం లేఖకు ఈ నివేదికను జత చేసే అవకాశాలున్నాయి. ఈనెల 31 జెన్‌కో సమావేశం నిర్వహించనుంది. జల విద్యుత్ కేంద్రం టెండర్లపై బోర్డు తుదినిర్ణయం తీసుకోనుంది. తాజా అంశాలు నిపుణుల కమిటీ నివేదికలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. టెండర్ల రద్దు చేసే అంశం కమిటీ నివేదికలో ఉన్నందున తదనుగుణంగా బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కొత్త టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ముందడుగు పడనుంది.
ఈ నెల 31 తర్వాత పోలవరం టెండర్లు!
పోలవరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ నివేదిక సమర్పించినందున లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం దూకుడు పెంచింది. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.