పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పిల్లర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. మొత్తం 52 మీటర్ల ఎత్తుకు అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసినట్టు గుత్తేదారు సంస్థ మేఘా ఇంజినీరింగ్ లిమిటెడ్ తెలియచేసింది. స్పిల్‌వేలోని రెండో పిల్లర్‌లో ఫిష్ లాడెర్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేశారు. రాష్ట్ర ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు.
ప్రాజెక్టులోని స్పిల్‌వేపై బ్రిడ్జి స్లాబ్ పనులు మరో 100 మీటర్ల మేర చేపట్టాల్సి ఉంది. పిల్లర్లపై నిర్మించాల్సిన గడ్డర్లను సైతం దాదాపుగా పూర్తి చేశారు. స్పిల్‌వేలో 48 గేట్లలో 28 గేట్ల అమరిక పూర్తి అయింది. ప్రస్తుతం వీటికి సిలెండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చేందుకు ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం జరుగుతోందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: