'ప్లాస్టిక్ రహిత సమాజమే మా లక్ష్యం' ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పెన్నాడ బీఐఈటీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వద్దంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రజా సమస్యల కోసం ఈనాడు, ఈటీవీ భారత్ ఎప్పుడు ముందు ఉంటాయని విద్యార్థులు, అధ్యాపకులు కొనియాడారు. తమ కళాశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.
ఇదీ చదవండి :
''ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటాం''