సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు, ఎడ్ల పందేలు సర్వసాధారణం. అయితే వాటికి భిన్నంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతంలో పందుల పోటీలు నిర్వహించారు. రాజుల కాలంలో ఈ పోటీలు నిర్వహించేవారని గిరిజనులు తెలిపారు. పోటీలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.