ఎండలతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గడచిన రెండు రోజులుగా వీస్తున్న వేడి గాలులతో అల్లాడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆయా గ్రామాల్లోని చెరువు గట్టుపై ఉన్న చెట్ల కింద సేద తీరుతున్నారు. జూన్ రెండో వారం మెుదలైనప్పటికీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీచదవండి... 'విలువలు పాటించండి... సమస్యలపై చర్చించండి '