రైతుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలం శెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి భవనం, గోదాం భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల అవసరాలు తీర్చడం కోసమే రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోనికి తెచ్చామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకొని రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సహకారశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి