ETV Bharat / state

గందరగోళంగా ఆన్‌లైన్‌ పాఠాలు..తల్లిదండ్రుల ఆందోళన - గందరగోళంగా ఆన్‌లైన్‌ పాఠాలు

మహమ్మారి కరోనా కారణంగా పాఠశాలల పునఃప్రారంభ తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ తరుణంలో విద్యార్థుల భవితవ్యం పేరుతో పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలకు తెరలేచింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘వారధి’ పేరుతో దూరదర్శన్‌లో పాఠాలను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించిన కార్పొరేట్‌ యాజమాన్యాలు తాజా పరిస్థితిని సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి.ఇదిలా ఉంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండా ఆన్‌లైన్‌ తరగతులను బోధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తమ పిల్లల భవితవ్యం ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

online classes
online classes
author img

By

Published : Jul 7, 2020, 1:49 PM IST

ప్రభుత్వ ప్రకటనతో పాఠశాలల పునఃప్రారంభం ఆగస్టు మూడో వారానికి వాయిదా పడింది. సాధారణంగా ఏడాదిలో పాఠశాల పనిదినాలు 233 ఉంటాయి. ఇప్పటికే ఈ ఏడాది 20 రోజులు కరిగిపోగా మరో 35 రోజులు బడి గంటలు వినిపించే అవకాశం లేదు. ఆగస్టు మూడో వారానికి అయినా కరోనా తగ్గుముఖం పడితే పాఠాల బోధనకు కనీసం 160- 170 రోజులు సమయం దొరికే అవకాశం ఉంది.

భావితరాల భవితవ్యమే పరమావధి

దేశంలో పరిస్థితులను అంచనా వేసిన జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం ఎనిమిది వారాల అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రతిపాదించింది. కేరళలో అక్కడి ప్రభుత్వం తొలి గంట (ఫస్ట్‌ బెల్‌) పేరుతో నెల రోజులుగా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పరోక్ష బోధనలో తమ విద్యార్థులను తీర్చిదిద్దడానికి వీలైన అన్ని అవకాశాలను ప్రభుత్వం సహా ప్రైవేట్‌ యాజమాన్యాలు అన్వేషిస్తున్నాయి. సర్కారీ బడుల విద్యార్థులకు ‘వారధి’ పేరుతో దూరదర్శన్‌ ప్రసారాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఆండ్రాయిడ్‌ తదితర ఆన్‌లైన్‌ పరికరాల సదుపాయం ఉన్న విద్యార్థులతో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించింది. వారధి పాఠాలపై వర్క్‌ షీట్లను సమీక్షించి విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేయాలని చెప్పింది. పాఠశాల గ్రంథాలయాల్లోని పుస్తకాలను చిన్నారులకు ఇచ్చి సెలవుల్లో వీలైనన్ని ఎక్కువ చదివించాలని దిశానిర్దేశం చేసింది.

కార్పొరేట్‌ దూకుడు

కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాయి. ఫీజులు చెల్లించిన విద్యార్థులకే సంబంధిత లింక్‌ను వాట్సాప్‌లకు పంపుతున్నాయి. పట్టణాలు, కొన్ని గ్రామాల్లోని కొన్ని సెమీ కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలు ఇదే ఒరవడిని అనుసరిస్తూ పాఠ్య, రాత పుస్తకాల విక్రయాలను సైతం చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆండ్రాయిడ్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసే స్థోమత లేదని, ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తే తమ పిల్లల భవితవ్యం ఏమిటని పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానిదే తుది నిర్ణయం

ఆన్‌లైన్‌ తరగతులపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా, ఆ పేరుతో రుసుముల వసూళ్లకు పాల్పడినా సంబంధిత విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. - సీవీ రేణుక, డీఈవో

ఇదీ చదవండి: భారత్​లో 20వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.