పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని అయ్యన్న కాలనీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఇటీవల విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేశారు.
బుధవారం కరోనా పాజిటివ్ రావటంతో పురపాలక, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని ఏలూరు కొవిడ్ ఆస్పత్రికి తరలించగా... అయ్యన్న కాలనీ ప్రాంతాన్ని రెడ్‌జోన్ గా ప్రకటించినట్లు కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.