ETV Bharat / state

ఏలూరు: అంతుచిక్కని వ్యాధి.. వందలాదిగా ఆసుపత్రులపాలు - వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్న ఏలూరు వాసులు

నోటి నుంచి నురగరావడం, వాంతులు చేసుకోవడం, మూర్ఛపోవడం.. ఇలాంటి లక్షణాలతో ఏలూరులో రెండో రోజూ పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రిలో చేరారు. దాదాపు 300మందికి పైగా ప్రజలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతుచిక్కని అనారోగ్య సమస్యలతో.. ఏలూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులకు వైరల్, బ్యాక్టీరియల్, కొవిడ్, నీటి, సిటిస్కాన్ సహా అన్ని పరీక్షలు నిర్వహించినా.. ఎక్కడా వ్యాధి నిర్థారణకు సంబంధించిన ఆనవాళ్లు వైద్యులకు కనిపించకపోవడం కలకలం రేపుతోంది.

eluru health issue
ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న బాధితులు
author img

By

Published : Dec 6, 2020, 9:58 PM IST

Updated : Dec 7, 2020, 6:35 AM IST

శ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం పొద్దుపోయేసరికి ఈ సంఖ్య 317కు చేరింది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మూర్ఛపోయి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ శ్రీధర్‌ (45) మరణించారు. రెండు రోజులుగా ఈ వింత వ్యాధితో వందల మంది ఆసుపత్రుల పాలవుతున్నా దీనికి కారణాలేమిటో తేలకపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలవరం రేకెత్తిస్తోంది. బాధితుల్లో అత్యధికులు 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయసువారే. రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులేవీ లేకపోయినా ఇలా ఉన్నట్లుండి అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశంగా మారింది.

ఆసుపత్రిపాలైన వారిలో 12 సంవత్సరాల్లోపు చిన్నారులు కూడా దాదాపు 40 మంది వరకూ ఉన్నారు. శనివారం ఏలూరు నగరంలోని తాపీమేస్త్రీకాలనీ, పడమరవీధి, కొత్తపేట, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతీపేట ప్రాంతాలవారు అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. ఆదివారం కొత్తగా ఇందిరమ్మ కాలనీ, మరడాని రంగారావు కాలనీ, వైఎస్సార్‌ కాలనీల నుంచి ముగ్గురు ఆస్పత్రిలో చేరడం గమనార్హం. మరోవైపు దెందులూరు పరిధిలోని కేదవరం ప్రాంతం నుంచి నలుగురు వింత వ్యాధి లక్షణాలతో స్థానికంగానే చికిత్స పొంది కోలుకున్నారు.

ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న బాధితులు

ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గీతాప్రసాదిని ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనే ఉండి బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 10 గంటలకు విలేకర్లతో మాట్లాడారు. చాలామంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని, ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ జిల్లా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు ఆశ్రం వైద్యకళాశాల వైద్యులు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 30 మంది వైద్యులు బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోహన్‌ పేర్కొన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని విజయవాడ, గుంటూరు జీజీహెచ్‌లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ ఆసుపత్రిలో ప్రభ (6), చెల్లుబోయిన సురేష్‌(24), జె.అనూరాధ (27), సింహాచలమ్మ (80) చికిత్స పొందుతున్నారు. అనూరాధ నాలుగు నెలల గర్భిణి. ఈమె వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ నలుగురి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి మరో ఆరుగురిని విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన చలపతిరావు (65), శంభులింగాచారి (51), కుసుమకుమారి (42), రమణమ్మ (59), లక్ష్మీకుమారి(55)లను ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, వారికి ప్రాణాపాయం లేదని సూపరింటెండెంట్‌ ప్రభావతి తెలిపారు.

లక్షణాలను బట్టి చికిత్స
బాధితుల లక్షణాలు, వారి ఆరోగ్య చరిత్రను అనుసరించి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి మూలాలు తెలిస్తే అందుకు తగ్గ చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు అనుసరించి అందిస్తున్న చికిత్స వల్ల రోగులు గంటల వ్యవధిలోనే కోలుకుంటున్నారని పేర్కొన్నారు. వయసులో పెద్దవారికి మాత్రం సీటీస్కాన్‌ తీస్తున్నారు. జ్వరం, వాంతులు వంటి లక్షణాలు లేనందున సెలైన్‌, మందులతో చికిత్స అందిస్తున్నారు.

బాధితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు

కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో బాధితులందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఎయిమ్స్‌ వైద్య బృందం అభిప్రాయపడింది. మంగళగిరి ఎయిమ్స్‌ నుంచి డాక్టర్‌ కక్కర్‌ నేతృత్వంలో వైద్యుల బృందం ఏలూరుకు వచ్చింది. ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గీతాప్రసాదిని, ఇతర అధికారులతో మాట్లాడింది. ఆర్టీపీసీఆర్‌ ద్వారా నమూనాలు పరీక్షించేందుకు తాము అవసరమైన ఏర్పాట్లతో వచ్చినట్లు వారు తెలిపారు. అప్పటివరకు కొద్దిమందికి మాత్రమే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌ వైద్యులు బాధితుల జీవనోపాధి, వారి నివాస ప్రాంతాలు, ఆహార అలవాట్లు, కరోనా నేపథ్యంలో మందులు ఏమైనా వాడుతున్నారా? నీటి సరఫరా తీరు గురించి అధికారులతో ఎక్కువ సమయం చర్చించారు. ఏ చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ నిర్ధారణ కోసం బాధితుల నుంచి ఎయిమ్స్‌ వైద్య బృందం నమూనాలు సేకరించింది. కొందరి నుంచి రక్త నమూనాలు కూడా సేకరిస్తున్నట్లు డాక్టర్‌ కక్కర్‌ ‘ఈనాడు’తో చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం), స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదివారం ఉదయం, సాయంత్రం పరామర్శించారు. బాధితుల నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

నీటి కాలుష్యమే కారణం!

ఏలూరు ఘటనకు నీరు కలుషితం కావడమే కారణంగా కనిపిస్తోందని సీనియర్‌ వైద్యులు ఒకరు ఆదివారం రాత్రి అన్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు ఇక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. నీటిని శుద్ధి చేసేందుకు ఉపయోగించే మందు మోతాదు మించి ఉండొచ్చని, ఆ ప్రభావం బాధితులపై కనిపించి ఉండొచ్చని ఎయిమ్స్‌ వైద్యులు అభిప్రాయపడినట్లు వైద్యులు తెలిపారు. దీనిని ఆర్గానో క్లోరిన్‌ ప్రభావంగా చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఏలూరు: అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి

Last Updated : Dec 7, 2020, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.