ETV Bharat / state

ఆక్వా రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి: రామానాయుడు - గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతుల సమస్యలు

లాక్​డౌన్​ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత నిమ్మల రామానాయుడు కోరారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు జరగటంలేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసినట్లే ప్రభుత్వమే ఆక్వా ఉత్పత్తులు కొనుగోలుచేయాలని నిమ్మల రామానాయుడు సూచించారు.

Nimmala ramanaidu
నిమ్మల రామానాయుడు
author img

By

Published : Apr 3, 2020, 7:25 PM IST

ఆక్వా రైతుల సమస్యలపై మాట్లాడుతున్న నిమ్మల రామానాయుడు

కరోనా ప్రభావం వల్ల ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. ఇలాంటి కష్టకాలంలో ఆక్వా రైతులను ఆదుకోకుండా సీఎం, మంత్రులు ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. పత్రికా ప్రకటనలు కాకుండా క్షేత్ర స్థాయిలోకి వచ్చి ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెంకించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రొయ్యల ధరలకు దిగువ స్థాయిలో ధరలకు అసలు పొంతనలేదన్నారు. ధాన్యం కొనుగోలు మాదిరిగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వమే ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకొనే విధంగా ధరల స్థిరీకరణ నిధి నుంచి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. సంవత్సరానికి 4 వేల కోట్లు వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తున్నది ఇంటికి రేషన్, నిత్యవసరాలు అందించడం కోసం కాదా అని నిమ్మల నిలదీశారు.

ఇదీ చదవండి:

ప్రాణాలు నిలబెట్టే వైద్యులకేదీ రక్షణ: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.