పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు ప్రమాదవశాత్తు గోదావరి కాల్వలో పడి మృతి చెందారు. ఇవాళ ఉదయం నడక కోసం వెళ్తుండగా.. ఆమెపై కుక్కలు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కాల్వ మెట్లపైకి దిగారు. ఈ క్రమంలో మెట్ల పైనుంచి జారి కాల్వలో పడిపోయారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో నీటి ప్రవాహ వేగానికి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఉండ్రాజవరం కాల్దారి వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. పోలీసులు నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: