ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన కుంకుళ్లమ్మ ఆలయం లో ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులను అనుగ్రహించనున్నట్టు ఈవో భ్రమరాంబ తెలిపారు.
ఉత్సవాల వేళ నిత్యం అమ్మవారికి ఉదయం 7 గంటలకు కుంకుమ పూజలు, 9 గంటలకు చండీహోమం, సాయంత్రం 4 గంటలకు ఆర్జిత సేవలు, తిరిగి సాయంత్రం 6 గంటలకు కుంకుమ పూజ జరుగుతుందని తెలిపారు.
అమ్మవారి విశేష అలంకారాలు :
- 17నశ్రీమహారేణుకాదేవి
- 18నశ్రీబాలాత్రిపురసుందరీదేవి
- 19న శ్రీ గాయత్రీ దేవి
- 20న శ్రీ అన్నపూర్ణాదేవి
- 21న శ్రీ సరస్వతీదేవి
- 22నశ్రీలలితాత్రిపురసుందరీ దేవి
- 23న శ్రీ మహాలక్ష్మీ దేవి
- 24న శ్రీ దుర్గాదేవి, శ్రీమహిషాసుర మర్ధిని
- 25న శ్రీ రాజరాజేశ్వరీ దేవి
ఇదీ చదవండి: