పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్ రెండో చైర్మన్ ఎన్నిక సజావుగా సాగగా కో అప్షన్ సభ్యుడి ఎన్నికలో ఇద్దరికీ విబేధాలు వచ్చాయి. ఎమ్మెల్యే వర్గీయులు ఏడిదకోట సత్యనారాయణ పేరును కో ఆప్షన్ సభ్యుడిగా ప్రతిపాదించగా.. కొత్తపల్లి వర్గీయులు మాజీ కౌన్సిలర్ బళ్ల వెంకటేశ్వరరావు పేరును ప్రతిపాదించారు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ముదునూరి ప్రసదరాజు పార్టీ అధీష్ఠానంతో గంట సేపు చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్ పర్సన్ బర్రె వెంకట రమణ వాయిదా వేశారు. కౌన్సిల్ సభ్యులు అందరూ సమావేశంలో ఉండగా ఓటింగ్ పెట్టకుండా వాయిదా వేయడం ఏమిటని ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు.
ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా గత కొంత కాలంగా.. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు , మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మధ్య విభేదాలు బయటపడ్డాయనుకుంటున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎటు దారి తీస్తాయోనని చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: గ్రామ కార్యదర్శులపై వైకాపా నేతల దాడి