తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ముంపు ప్రాంతాలను లోకేశ్ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆకివీడు నుంచి సిద్ధాపురానికి ట్రాక్టర్ నడుపుతూ వెళుతున్న లోకేశ్ వెంట ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు.
సిద్ధాపురం సమీపానికి వచ్చేసరికి ట్రాక్టర్ ఒక వైపుకు వెళ్లిపోవటంతో సమీపంలోని ఉప్పుటేరు అంచుకు కుంగిపోయింది. అయితే ట్రాక్టర్‌ను చాకచక్యం నిలిపేయటంతో తృటిలో ప్రమాదం తప్పింది. అనంతరం పక్కనే ఉన్న ముంపు ప్రాంతాలను లోకేశ్ పరిశీలించారు.
ఇదీ చదవండి: