ETV Bharat / state

అమరావతి ఉద్యమంలో అంతిమ విజయం రైతులదే: నారా లోకేశ్​

author img

By

Published : Jan 20, 2021, 4:22 PM IST

అమరావతి ఉద్యమంలో అంతిమ విజయం రైతులదేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భంగా ఉద్యమకారులందరికీ ఉద్యమాభినందనాలు తెలిపారు

nara lokesh comments on amaravathi movement  400 days

అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భంగా ఉద్యమకారులందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 'జై అమరావతి' అని నినదిస్తూ రైతులు మహిళలు, యువత ఆదర్శంగా నిలిచారన్నారు. అమరావతిపై సీఎం జగన్​ది కేవలం విష ప్రచారమేనని తేలిపోయిందని విమర్శించారు. ఇక అంతిమ విజయం రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులదేనని లోకేశ్ స్పష్టం చేశారు.

  • జై అమరావతి ఉద్యమం 400 రోజులకు చేరుకున్న సందర్భంగా ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అని నినదిస్తూ రైతులు మహిళలు,యువత ఆదర్శంగా నిలిచారు.(1/2)#400DaysOfAmaravatiProtests pic.twitter.com/7ZmdhQgczp

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించాలి..

సీఎం జగన్​కు మద్యం అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంపై లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఏలూరులో అంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమడోలు మండలం పూళ్లలో 28 మంది అనారోగ్యానికి గురయ్యారని విచారం వ్యక్తం చేశారు. అక్కడ అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించి మెరుగైన వైద్య సహాయం అందించాలని లోకేశ్​ డిమాండ్‌ చేశారు.

  • పూళ్లలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మెరుగైన వైద్య సహాయం అందించాలి. త్రాగునీరు కలుషితం కాలేదని ప్రకటనలు ఇవ్వడం, వార్తలు రాకుండా ఒత్తిడి చెయ్యడంపై పెట్టే సమయం సురక్షిత త్రాగునీరు అందించడం పై పెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.(3/3)

ఇదీ చదవండి: పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.