ETV Bharat / state

ఏపీడబ్ల్యూఆర్​డీసీకి నాబార్డు భారీ రుణం - ఏపీ నాబార్డు రుణం

రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు రుణ హస్తం అందించింది. ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీడబ్ల్యూఆర్​డీసీ)కు భారీ రుణాన్ని మంజూరు చేస్తూ నాబార్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను చింతలపూడి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం వినియోగించనుంది. 2022 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తోంది.

nabard sanction loan to apwrdc
nabard sanction loan to apwrdc
author img

By

Published : Feb 19, 2020, 6:45 PM IST

ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్​కు రూ.1931 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తూ నాబార్డు నిర్ణయం తీసుకుంది. నాబార్డు ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ అసిస్టెన్స్ కింద ఈ రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్టు నాబార్డు ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని వినియోగించనుంది. ఈ పథకం ద్వారా పశ్చిమగోదావరి - కృష్ణా జిల్లాల్లోని 33 మండలాల్లోని 410 గ్రామాలకు తాగునీరు, సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. గోదావరి వరద జలాలను మూడు దశల్లో మళ్లించేందుకు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేయనున్నారు. 53.5 టీఎంసీల నీటిని ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పశ్చిమగోదావరి, పశ్చిమ కృష్ణాలోని ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. మొత్తం 4.8 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సీజన్​లో నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీనితో పాటు జల్లేరు వద్ద 14 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్​ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజర్వాయర్ ద్వారా 26 లక్షల మందికి తాగునీటి సరఫరా చేసే అవకాశం ఉందని.. 2022 మార్చి నాటికి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి: 'రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుందనే నా బాధ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.