Raghu Rama Krishna Raju in Parliament: రాష్ట్రంలోని బోయలను ఎస్టీలో చేర్చాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ప్రస్తావించారు. కర్ణాటకలో ఇదే కులానికి చెందినవారు ఎస్టీ రిజర్వేషన్లు పొందుతుండగా.. ఏపీలో మాత్రం ఓబీసీల్లో చేర్చారని ఆయన వివరించారు. కేంద్రం వీలైనంత త్వరగా బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఆయన కోరారు.
"కర్ణాటకలో వాల్మీకి కులస్థులు ఎస్టీ జాబితాలో ఉన్నారు. ఏపీలో మాత్రం అదే కులానికి చెందిన బోయలను ఓబీసీ జాబితాలో చేర్చారు. 1956లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందినవారు కర్నూలు చుట్టుపక్కల స్థిరపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో కర్ణాటకలో ఉన్నవారు ఎస్టీలుగానూ, ఏపీలో ఉన్నవారు ఓబీసీలుగా చెలామణి అవుతున్నారు. ఏపీలో ఉన్న బోయలను కూడా కర్ణాటకలో మాదిరిగా ఎస్టీలుగా గుర్తించాలంటూ.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిఫారసు చేసింది. వీలైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చాలంటూ కేంద్రమంత్రి అర్జున్‌ముండాను కోరుతున్నాను. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను". - రఘురామకృష్ణరాజు, ఎంపీ
ఇవీ చదవండి: