ETV Bharat / state

కొడుకుపై తల్లి న్యాయపోరాటం.. ఎందుకు?

కొడుకుకు ఆస్తిపై ఉన్న మక్కువ...నవమాసాలు మోసి కనిపెంచి ఒక ప్రయోజకుడిని చేసిన తల్లి మీద లేకుండాపోయింది. తల్లి ఆస్తిని అమ్ముకొని.. సొమ్ము దగ్గర పెట్టుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి డబ్బులడిగితే నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. న్యాయం చేయాలని ఆమె అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోయింది. తిరిగి తిరిగి ఓపిక నశించటంతో కుమారుడిపై న్యాయ పోరాటానికి దిగింది.

మాతృవేదన...కుమారుడిపై న్యాయ పోరాటం
author img

By

Published : Aug 20, 2019, 7:35 PM IST

మాతృవేదన...కుమారుడిపై న్యాయ పోరాటం

నవ మాసాలు మోసి.. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు.. జీవిత చరమాంకంలో ఆసరాగా ఉంటాడనుకున్న ఓ తల్లికి నిరాశే ఎదురైంది. గొంతెమ్మ కోర్కెలు తీర్చకపోయినా కనీసం ఇంట్లో ఉండేందుకు కూడా అనుమతించలేదు. కన్నతల్లి అని చూడకుండా ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

కొడుకు ఆస్తి లాక్కుని తనను రోడ్డుపై పడేశాడని ఓ తల్లి న్యాయ పోరాటానికి దిగింది. తన భర్త మరణించాక కుమారుడు పొలం అమ్మి సొమ్ము చేసుకున్నాడని.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లోనుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశాడని పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఓ వృద్ధురాలు వాపోయింది. వైద్య ఖర్చులు అడిగినందుకు ఈ పని చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్డు మీద దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తనను కుమార్తె చేరదీసిందని తెలిపింది. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవటం వల్ల... స్థానిక గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టినట్లు తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటాన్ని విరమించేదే లేదని వృద్ధురాలు పేర్కొంది.

ఇవీ చూడండి-అమ్మతనం ముందు శత్రువేంటి: పిల్లికి పాలిచ్చిన శునకం

Intro:333

Body:777

Conclusion:పెన్నా లో పెరిగిన నీటి ఉధృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.