రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పాలకొల్లులో రైతులతో కలిసి శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాలకొల్లు వ్యవసాయ మార్కెట్లో నిరసన దీక్ష చేపట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. ఒక్క రైతుకైనా ఇన్ఫుడ్ సబ్సిడీ ఇచ్చినట్లు రుజువు చేస్తే ఇక్కడి నుంచే శాసనసభ స్థానానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధాకరంగా ఉందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: 'చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు ఏ కోర్టు ప్రశ్నించడానికి వీలు లేదు'