ETV Bharat / state

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి తప్పిన ప్రమాదం - వశిష్ట గోదావరి వరదలో చిక్కుకున్న రామానాయుడు

తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వరద ముంపు లంక గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన బోటు వశిష్ట గోదావరిలో ఆగిపోయింది. వెంటనే.. సిబ్బంది బోటును పక్కనే ఉన్న చెట్టుకు కట్టారు. బోటులో ఎమ్మెల్యేతో పాటు 8 మంది ఉన్నారు. ఎమ్మెల్యే కోసం అధికారులు ముందుగా చిన్న బోటు పంపేందుకు ప్రయత్నించారు. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చిన్నబోటు వెళ్లలేకపోయింది. చివరకు అధికారులు పర్యాటక బోటు పంపి నిమ్మల రామానాయుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

వశిష్ట గోదావరి వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే రామానాయుడు

author img

By

Published : Aug 19, 2020, 7:25 PM IST

Updated : Aug 19, 2020, 9:50 PM IST

వశిష్ట గోదావరి వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే రామానాయుడు

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రయాణిస్తున్న బోటు వశిష్ట గోదావరి వరదలో మొరాయించి.. మధ్యలో ఆగిపోయింది. ఎట్టకేలకు సారంగి చాకచక్యంతో బోటును చెట్టు వరకు తీసుకెళ్లి లంగర్ వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం రామరాజు లంక వద్ద గోదావరి మధ్యలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న బోటు ఆగిపోయింది. గోదావరిలో వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో బోటు ఆగినట్లు తెలుస్తోంది. బోటును సమీప చెట్ల వరకు నడిపించి సారంగి లంగర్ వేశారు. ఎమ్మెల్యేతో పాటు లంక గ్రామస్థులు పలువురు బోటులో ఉండిపోయారు.

గోదావరి వరద ఉద్ధృతంగా ఉండడంతో బోటులో ఉన్నవారు భయాందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను తీసుకొచ్చేందుకు చిన్నబోటును పంపేందుకు అధికారులు ప్రయత్నించారు. వరద అధికంగా ఉండడంతో చిన్న బోటు వెళ్లలేకపోయింది. దీంతో పర్యాటక బోటును పంపి నిమ్మల రామానాయుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు అధికారులు.

రామానాయుడు చిక్కుకుపోవడంపై చంద్రబాబు ఆరా

గోదావరి వరదల్లో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చిక్కుకోవడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రామానాయుడుతో సహా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని చంద్రబాబు కోరారు.

లోకేశ్ ఆందోళన

గోదావరి వరదల్లో ఎమ్మెల్యే నిమ్మల చిక్కుకోవడంపై లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రామానాయుడు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

Last Updated : Aug 19, 2020, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.