పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అమరావతి రైతులకు మద్దతుగా నిరసన తెలపడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రైతులు కాటన్ దొర విగ్రహం వద్ద ఆందోళనలు చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. వైకాపా శ్రేణుల సంబరాలకు అనుమతిచ్చినవారు.. మాకెందుకు ఇవ్వరంటూ నిమ్మల ప్రశ్నించారు. బలవంతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించటంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు.
ఇవీ చదవండి..