ఇసుక కొరతను నిరసిస్తూ... ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు... ఎమ్మెల్యే మంతెన రామరాజు వెల్లడించారు. నూతన ఇసుక విధానం వచ్చి నెలన్నర దాటినా... ఇంకా ఇసుక దొరకడంలేదని మంతెన ఆరోపించారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా... అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదనన్నారు.
కొత్త విధానం గతం కంటే మెరుగ్గా ఉండాలి గాని... ప్రజలు ఇబ్బంది పడేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవెదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంతో పాటు... అనుబంధ వ్యాపారాలు దెబ్బ తిన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని విమర్శించారు. ఇసుకను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండీ... 'ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం... అంతా పారదర్శకం'